: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు... బడ్జెట్ పై చర్చకే ప్రాధాన్యం


తెలంగాణ అసెంబ్లీ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. ప్రజా సమస్యలపై చర్చే ప్రధానమని భావించిన టీఆర్ఎస్ సర్కారు సెలవు దినాల్లోనూ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. సర్కారు ప్రతిపాదనకు విపక్షాలు కూడా సరేనన్నాయి. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాల్లోనూ సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా నేటి సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై చర్చకే అత్యధిక ప్రాధాన్యమిచ్చిన సభ... ప్రశ్నోత్తరాలను రద్దు చేసింది. నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేసిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేరుగా బడ్జెట్ పై చర్చకు తెర తీశారు.

  • Loading...

More Telugu News