: కలిసిన ‘చంద్రులు’!... న్యాయాధికారుల సదస్సు వేదికగా అరుదైన దృశ్యం


ఇద్దరు ‘చంద్రులు’ మరోమారు కలిశారు. ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన న్యాయాధికారుల సదస్సు వేదికగా నిలిచింది. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాలుపంచుకున్న ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు హాజరయ్యారు. చంద్రబాబు, కేసీఆర్ లు ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత చంద్రబాబు మాట్లాడగా, ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరువురూ... పరస్పరం పేర్లు ప్రస్తావించుకున్నారు. వేదికపై కూర్చున్న వారిద్దరి మధ్య ముగ్గురు న్యాయమూర్తులు కూర్చోగా, చంద్రబాబు పక్కన తెలంగాణ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆసీనులయ్యారు.

  • Loading...

More Telugu News