: జేఎన్యూ ఘటనలో బెయిల్ పై విడుదలైన వారు ఒలింపిక్ హీరోలేమీ కాదు: అనుపమ్ ఖేర్


జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్యూ) ఘటనకు సంబంధించి బెయిల్ పై విడుదలైన విద్యార్థులు ఒలింపిక్ హీరోలేమీ కాదని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం ఆయన ‘బుద్ధా స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్’ సినిమా స్క్రీనింగ్ నిమిత్తం జేఎన్యూ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో బెయిల్ పై విడుదలైన వారికి క్యాంపస్ విద్యార్థులు స్వాగతం పలుకవద్దని సూచించారు. తిరుగుబాటు తత్వం నుంచి బయటపడి దేశభక్తిని అలవర్చుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. జేఎన్యూ ఘటనలో విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిల్ భట్టాచార్య లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం అనుపమ్ ఖేర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ సహా, మరికొంత మంది మద్దతుదారులు ఈ రోజు రాత్రి క్యాంపస్ లో యూనిటీ మార్చ్ నిర్వహించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ఉమర్ ఖలీద్, అనిర్బాన్ భట్టాచార్య లకు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరైంది.

  • Loading...

More Telugu News