: అర్ధ సెంచరీలతో అదరగొట్టిన ఆమ్లా, డికాక్...ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకుంటున్నారు
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టుకు ఓపెనర్లు డికాక్ (52), హషీమ్ అమ్లా (58) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. చెలరేగి ఆడిన డికాక్ కేవలం 24 బంతుల్లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, అమ్లా 31 బంతుల్లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. దీంతో సఫారీలకు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే, డికాక్ ను అలీ అవుట్ చేయడంతో బ్యాటింగ్ కు వచ్చిన డివిలియర్స్ (12) ఘోరంగా విఫలమయ్యాడు. అనంతరం అమ్లా కూడా వెనుదిరగడంతో డుమిని (1), డుప్లెసిస్ (7) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సఫారీ ఆటగాళ్ల దూకుడుకు ఇంగ్లండ్ బౌలర్లంతా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఓవర్ కి 8 రన్ రేట్ తో పరుగులు సమర్పించిన అలీ రెండు వికెట్లు తీయగా, 9 పరుగుల చొప్పున సమర్పించిన రషీద్ ఒక వికెట్ తీయడం విశేషం.