: విదేశీ కాల్స్ నుంచి ఐఎస్‌డీ చార్జీల భారం ఇక ఉండ‌దు.. బీఎస్ఎన్ఎల్ ఆఫ‌ర్


మీ బంధుమిత్రులు లేదా మీరు విదేశాల్లో ఉంటున్నారా..? అక్క‌డి నుంచి భార‌త్‌కు ఫోన్ చేస్తే ఐఎస్‌డీ చార్జీల భారం ప‌డుతోందా? అయితే బీఎస్ఎన్ఎల్ మీకో తీపిక‌బురు అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా రూపొందించిన యాప్ తో ఐఎస్‌డీ చార్జీల మోత త‌గ్గ‌నుంది. ఇక‌పై కేవ‌లం నెలవారీ చార్జీల‌తో ప్రపంచంలో ఎక్క‌డినుంచైనా భారత్‌లోని బంధువులతో మాట్లాడుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి ఫిక్స్‌డ్‌ మొబైల్‌ టెలిఫోనీ (ఎఫ్‌ఎంటీ)ని ప్రారంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో కొత్తగా యాప్‌ను విడుదల చేసింది. విదేశాల్లోని బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారులు త‌మ‌ మొబైల్‌ ఫోన్‌ను ఈ యాప్‌ ద్వారా వారి ల్యాండ్‌లైన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. దాని ద్వారా భారతదేశంలోని ఫోన్లకు కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతో ఐఎస్‌డీ బిల్లు నిరోధించుకోవ‌చ్చు. కేవలం నెలవారీ చార్జీలను మాత్రమే వసూలు చేస్తారు.

  • Loading...

More Telugu News