: ఆకట్టుకున్న కివీస్ బౌలర్లు...26 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన ఆసీస్


టీ20 వరల్డ్ కప్ లో పటిష్ఠ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు 143 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించగా, బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ బ్యాట్స్ మన్ కివీస్ బౌలర్ల ధాటికి చతికిలపడ్డారు. ఖ్వాజా (38), వాట్సన్ (13) ఆకట్టుకున్నప్పటికీ భారీ స్కోరు సాధించడంలో తడబడ్డారు. స్మిత్ (6), వార్నర్ (6) విఫలం కావడంతో నిలదొక్కుకున్నాడని భావించిన మ్యాక్స్ వెల్ (22) కూడా అవుటయ్యాడు. దీంతో ఆసీస్ కష్టాల్లో పడింది. అస్గర్ (8), మిచెల్ మార్స్ (22) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మరో 26 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News