: గతంలో ఒత్తిడి మా మీద ఉండేది...ఇప్పుడు టీమిండియా మీద ఉంది: వకార్ యూనిస్


గతంలో గెలవాలనే ఒత్తిడి తమ జట్టుపై ఉండేదని పాకిస్థాన్ జట్టు కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. రేపు భారత్ తో టీ20 వరల్డ్ కప్ లో తలపడనున్న నేపథ్యంలో కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు గెలవాలనే ఒత్తిడి టీమిండియాపై ఉందని అన్నాడు. భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుందని వకార్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత్ పై ఒత్తిడి పెరిగిందని వకార్ అభిప్రాయపడ్డాడు. కోల్ కతాలో మైదానంలోను, మైదానం బయట అభిమానుల మద్దతు బాగుందని వకార్ అన్నాడు. రేపటి మ్యాచ్ లో టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని, తమ జట్టు బలాలపై మాత్రమే దృష్టి సారించామని వకార్ యూనిస్ తెలిపాడు.

  • Loading...

More Telugu News