: ఇకపై షిర్డీ పుణ్యక్షేత్రానికి విమానంలో కూడా వెళ్లొచ్చు!
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన షిర్డీకి సమీపంలో త్వరలో విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ (ఎంఎడీసీ) ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్ వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఎయిర్ కంట్రోల్ తో పాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రైవేటు విమానాలకు ఇక్కడ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఇంత వరకూ రైలు, బస్సుల ద్వారా భక్తులు షిర్డీకి వెళుతుండేవారు. ఈ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అందుబాటులోకి వస్తే మరింత త్వరగా షిర్డీ చేరుకునే అవకాశం భక్తులకు లభించనుంది.