: అభిమానులూ, తప్పుడు పోస్టులను నమ్మకండి: అమితాబ్ బచ్చన్


తమ కుటుంబ సభ్యుల పేరిట వచ్చే తప్పుడు ట్విట్టర్ పోస్టులను నమ్మవద్దని బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులను కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు తన మనుమరాలు నవ్యానవేలి నందా పేరిట ట్విట్టర్ ఖాతా తెరిచి, టీ20 ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో టీమిండియా ఓడిపోయిందని పోస్టు చేసినట్లు బిగ్ బీ తెలిపారు. ట్విట్టర్ లో నవ్యా నవేలికి అసలు ఖాతానే లేదని, ఇటువంటి పోస్టులను నమ్మవద్దని అమితాబ్ తన అభిమానులను కోరారు.

  • Loading...

More Telugu News