: ఆంధ్రప్రదేశ్ యువత కోసం కొత్త పాలసీ: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బాగుండేలా సరికొత్త యూత్ పాలసీని ప్రకటించనున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ, త్వరలోనే 20 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని వివరించారు. ప్రస్తుతమున్న హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చనున్నట్టు యనమల పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆలోచన ఉందని, ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సివుందని వివరించారు. యువ ఔత్సాహికులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని, స్టార్టప్ సంస్థలతో ముందుకు వచ్చే వారిని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు.