: బ్లాక్ డ్రెస్ లో అసెంబ్లీకి వైసీపీ!... సభను అడ్డుకోవడమే లక్ష్యమట!
ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన తమ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి అనుమతించకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా వరుస ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని విపక్ష వైసీపీ తీర్మానించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు నల్లటి దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లాలని సమావేశం నిర్ణయించింది. అంతేకాకుండా రేపటి సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించిన ఆ పార్టీ, సభా కార్యక్రమాలను అడ్డుకుని తీరాలని కూడా కీలక నిర్ణయం తీసుకుంది.