: మరో వివాదం... హిందూ యువతితో పెళ్లేంటి?: క్రిస్టియన్ ను వివరణ కోరిన కేరళ చర్చ్


తన సభ్యుడు హిందూ యువతిని వివాహం చేసుకోవడాన్ని తప్పుబట్టిన ఓ చర్చ్ అతన్ని వివరణ కోరడంతో కేరళలో మరో వివాదం మొదలైంది. ఊరక్కం పట్టణంలోని సెయింట్ జోసఫ్ చర్చ్ సభ్యుడైన బెన్నీ తోమ్మన, జయసుధన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత ఈ జంట తమ మత విశ్వాసాలనే పాటిస్తూ వచ్చారు. చర్చ్ విశ్వాసాలకు వ్యతిరేకంగా హిందూ మహిళను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని క్యాథలిక్ చర్చ్ పరిధిలోని ఇరిన్ జలకుడా బిషన్ పేరిట తాఖీదులు రావడంతో బెన్నీ అవాక్కయ్యాడు. చర్చ్ ప్రత్యేక ట్రైబ్యునల్ ముందు హాజరు కావాలని కూడా అతనికి ఆదేశాలు అందాయి. కాగా, తమ వివాహం పదేళ్ల క్రితం జరిగిందని, తాను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని బెన్నీ చెబుతున్నాడు. ప్రత్యేక వివాహాల చట్టం కింద 2005లోనే తమ పెళ్లిని రిజిస్టర్ చేశామని, ప్రశాంతంగా జీవిస్తుంటే, ఇప్పుడీ విచారణలు ఏంటని అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. చర్చ్ వివరణ కోరడంపై మహిళా సంఘాలు అభ్యంతరాలను తెలుపుతున్నాయి.

  • Loading...

More Telugu News