: రావెల సుశీల్ ఓ చిత్తకార్తె కుక్క...టీచర్ ను చెప్పుతో కొట్టిన చరిత్ర అనితది!: టీడీపీ నేతలపై రోజా ఫైర్
తనపై ముప్పేట దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగారు. తనపై ఓ స్థాయిలో ఆరోపణలు గుప్పించిన టీడీపీ నేతలు రావెల్ కిశోర్ బాబు, పీతల సుజాత, అనిత, బొండా ఉమామహేశ్వరరావు తదితరులపై వరుసగా ఆరోపణలు గుప్పించారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా తనను సభ లోపలికి అనుమతించడం లేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం రాజ్ భవన్ వద్దే ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళ చేయి పట్టి కారులోకి లాగేందుకు యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల సుశీల్ ను ఆమె చిత్తకార్తె కుక్క అని సంబోధించారు. చిత్తకార్తె కుక్క లాంటి వ్యక్తికి తండ్రిగా ఉన్న రావెల కిశోర్ బాబు ఏపీ కేబినెట్ లో కొనసాగుతున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న టీచర్ ను చెప్పుతో కొట్టిన చరిత్ర అనితదని ఆమె చెప్పారు. అనిత దారుణంపై డెక్కన్ క్రానికల్ పత్రిక కథనం కూడా రాసిందన్నారు. బైక్ రేసింగ్ లతో ఓ యువకుడి ప్రాణాలు తీసిన బొండా ఉమ కొడుకును ఎందుకు శిక్షించరని ప్రశ్నించారు.