: రూ. 90 వేల నుంచి రూ. 3 లక్షలకు పెరగనున్న ఐఐటీ ఫీజు!


ఐఐటీ విద్యను అభ్యసించాలని భావించే విద్యార్థులు ప్రస్తుత ఫీజుపై అధికంగా మూడు రెట్లకు పైగా చెల్లించాల్సి వుంటుంది. ఈ మేరకు ఐఐటీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం వార్షిక ఫీజు రూ. 90 వేలుగా ఉండగా, దాన్ని రూ. 3 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఇక దీనిపై నిర్ణయం మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ తీసుకోనున్నారు. దీంతో పాటు 2017 నుంచి న్యాట్ (నేషనల్ అథారిటీ ఆఫ్ టెస్ట్) ఆధ్వర్యంలో సరికొత్త పద్ధతిలో ప్రవేశ పరీక్షలు జరపాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవాంక్ ఖాఖార్ నేతృత్వంలో ఐఐటీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు సమావేశమై ఈ మేరకు సిఫార్సులను మానవ వనరుల శాఖకు పంపారు. విద్యార్థులందరికీ వడ్డీలేని విద్యా రుణాలను దగ్గర చేయాలని కూడా కోరింది. ఇందుకోసం విద్యాలక్ష్మి స్కీమ్ ను వాడుకోవాలని పేర్కొంది. కాగా, ఒకేసారి ఫీజులను ఇంత మొత్తంలో పెంచడం అవసరమా? అని ప్రశ్నిస్తూ, ఇంకోసారి సిఫార్సులు పరిశీలించాలని ఈ కమిటీకి సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News