: రోజా అడ్డగింతకు ఆధారాలేమున్నాయన్న జగన్... స్పీకర్ ఆదేశాలే శిరోధార్యమన్న మార్షల్స్


తనపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయించుకుని సభకు వచ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోజాకు మద్దతుగా నిలిచిన విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మార్షల్స్ మధ్య ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. రోజా సభలోకి వెళ్లేందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మార్షల్స్ కు చెప్పిన జగన్... అడ్డుకోవడానికి మీ వద్ద ఏం ఆధారాలున్నాయని నిలదీశారు. జగన్ సూటిగా ప్రశ్నించడంతో కాస్తంత తడబడ్డ మార్షల్స్... వెనువెంటనే తేరుకుని ఘాటైన సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమకు స్పీకర్ ఆదేశాలే శిరోధార్యమని, ఇతర విషయాలను ఏమాత్రం పట్టించుకోమని వారు తెగేసి చెప్పారు. దీంతో మార్షల్స్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే బైఠాయించారు.

  • Loading...

More Telugu News