: ఆమెను నా కారులో ఎక్కించుకుంటా... ఐ కెన్ టేక్ ఎనీబడీ: పోలీసులపై జగన్ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో హై డ్రామా కొనసాగుతోంది. రోజా తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదించిన న్యాయవాది ఇందిరా జైసింగ్ ను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో జగన్ కల్పించుకున్నారు. ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళతానని అన్నారు. మీరెలా తీసుకెళ్తారని పోలీసులు ప్రశ్నించగా, జగన్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. "కావాలంటే నా పాస్ తీసుకోండి. ఆమెను నేను తీసుకెళ్తా. ఐ హ్యావ్ మై రైట్. ఐ కెన్ టేక్ ఎనీబడీ" అంటూ వాగ్వాదానికి దిగారు. నా ఆఫీసుకు తీసుకెళ్తా. కావాలంటే తన తరఫున పాస్ పంపిస్తానని పోలీసులకు చెప్పారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు ఇందిరా జైసింగ్ లోనికి వెళ్లేందుకు అనుమతించారు.