: ‘సీఎం రిలీఫ్ ఫండ్’ భోక్తలకు సంకెళ్లు!... 10 మంది అరెస్ట్, కేసీఆర్ కు నివేదిక


ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి సహాయ నిధి' (సీఎం రిలీఫ్ ఫండ్)కీ అవినీతి చెద పట్టింది. ప్రైవేటు ఆసుపత్రుల పేరు చెప్పి రంగంలోకి దిగిన అక్రమార్కులు ఏకంగా రూ.75 లక్షలను జేబులో వేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ అక్రమ దందా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేశారు. 56 ఆసుపత్రుల పేరు చెప్పుకుని 128 మంది అక్రమార్కులు ఏకంగా రూ.75 లక్షలను తమ జేబుల్లో వేసుకున్నారని గుర్తించారు. వెనువెంటనే ఈ డబ్బును కాజేసినవారిలో తొలి విడతగా 10 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దర్యాప్తునకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు సీఎం కేసీఆర్ కు అందజేశారు.

  • Loading...

More Telugu News