: లోటస్ పాండ్ లో జగన్ ను కలిసిన రోజా


చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏడాదిపాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానంపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పార్టీ అధినేత జగన్ కు ఆమె చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శికి మధ్యంతర ఉత్తర్వులను అందజేసిన విషయం ఆమె వివరించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలతో చర్చించినట్టు ఆమె తెలిపారు. రేపు శాసనసభలో స్టే ఉత్తర్వులను స్పీకర్ కు అందజేయనున్నట్టు ఆమె చెప్పారు. మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిసినట్టు ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News