: ఏప్రిల్ వరకు ఈడీని గడువు కోరిన విజయ్ మాల్యా
9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కావాలని ఈడీని కోరారు. గతేడాది మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), విచారణకు మార్చి 18న తమ ముందు హాజరుకావాలని సమన్లు పంపింది. దీనికి స్పందించిన మాల్యా, విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కావాలని కోరుతూ లేఖ రాసినట్టు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున తనకు ఏప్రిల్ వరకు గడువు కావాలని కోరినట్టు తెలుస్తోంది.