: ఒవైసీ లక్నో సభకు అనుమతి నిరాకరణ
తన పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని ఉచ్చరించనన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లక్నోలో నిర్వహించతలపెట్టిన సభకు యూపీ సర్కార్ అనుమతించలేదు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్నోలో 30 మందికి మించి తన అనుచరులతో ఒవైసీ కనపడకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఒవైసీ లక్నో పర్యటన రద్దయినట్లు ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షాకత్ అలీ పేర్కొన్నారు. కాగా, లక్నోతో పాటు అజంఘర్ లో అసదుద్దీన్ పర్యటించాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఈ రెండు పర్యటనలు రద్దయ్యాయి. ఈ సందర్భంగా షాకత్ అలీ మాట్లాడుతూ, ఒవైసీ అంటే సమాజ్ వాది పార్టీకి భయమని, అందుకే సభలకు అనుమతివ్వలేదని అన్నారు.