: అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడానికి అదేమీ టీడీపీ ఆఫీసు కాదు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు వారి ఇష్టానుసారం వ్యవహరించడానికి అదేమీ వారి టీడీపీ ఆఫీసు కాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ తీర్మానంపై హైకోర్టు తీర్పు అధికార పక్షానికి చెంపదెబ్బ అని అన్నారు. తెనాలి రామకృష్ణుడిలా ఆర్థిక మంత్రి యనమల వ్యవహరిస్తున్నారని, చట్టానికి లోబడే ప్రతిఒక్కరూ పనిచేయాలని, లేకపోతే ఇలాంటి చెంపదెబ్బలు తప్పవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, ఆ విషయాన్ని అధికారపక్షం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.