: నేడు భానుడి ప్రతాపం... భగ్గుమననున్న ఎండ!
గత మూడు రోజులుగా తన ప్రతాపాన్ని కాస్తంత తగ్గించుకున్న భానుడు నేడు మళ్లీ విరుచుకుపడనున్నాడు. నేడు హైదరాబాద్ నగరంలో 39 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఈ సీజనులో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న అధికారులు, మధ్యాహ్నం తరువాత అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వెల్లడించారు. కాగా, మంగళవారం నాడు 35.4 డిగ్రీలుగా ఉన్న వేడి, బుధవారం నాడు ఏకంగా మూడు డిగ్రీలు పెరిగి 38.8 డిగ్రీలకు చేరిందని అధికారులు పేర్కొన్నారు. బయట తిరిగే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.