: 'ఊపిరి'కి డబ్బింగ్ చెప్పేశా!: తమన్నా


తమన్నా కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేసుకుంది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తొలిసారిగా 'ఊపిరి' సినిమాలో డబ్బింగ్ చెప్పింది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజే పూర్తి చేసింది కూడా. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తాజాగా చెబుతూ, "నా స్వీట్ హార్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలసి ఇప్పుడే 'ఊపిరి' సినిమాకు డబ్బింగ్ చెప్పడం పూర్తిచేశాను" అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో నాగార్జునకు పీఏగా తమన్నా నటించింది. మరో హీరోగా కార్తీ నటించాడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News