: బడ్జెట్ అంటేనే గందరగోళం, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా చదువుకోవాలి: ‘జానా’ వ్యాఖ్యలతో నవ్వులు


బడ్జెట్ అంటేనే లెక్కలు అని.. ఆ లెక్కలు ఉన్న పత్రాలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తమ చేతికి ఇచ్చారని.. ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా చదువుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అనడంతో తెలంగాణ శాసనసభలో నవ్వులు విరిశాయి. ‘సభలో చాలా మంది మంత్రులు, సభ్యులు ఎవరూ లేరు. వాళ్లందరూ మండలికి పోయినరా?’ అంటూ జానారెడ్డి తనదైన శైలిలో అనడంతో శాసనసభ మళ్లీ నవ్వులతో నిండిపోయింది. అంతేకాకుండా, ఈటల బడ్జెట్ పై ఆయన చిన్న కవిత లాంటిది ఒకటి చదివారు. బడ్జెట్ కేటాయింపుల గురించి ఆయన మాట్లాడుతూ, తాను అంచనా వేసిన మేరకే ఈటల కేటాయించారని అన్నారు. లెక్కలతో గారడీ చేశారని, ప్రజలను భ్రమింపజేశారని జానా విమర్శించారు.

  • Loading...

More Telugu News