: గుర్రాన్ని ఒక దెబ్బ కొట్టినట్టు నిరూపిస్తే, నా కాలు నరికేసుకుంటా: బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో పోలీసు గుర్రాన్ని గాయపర్చిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఆ గుర్రంపై తాను ఒక్క దెబ్బ కూడా వేయలేదని, లాఠీతో నేలపై కొట్టాను తప్పా, గుర్రాన్ని కాదని అంటున్నారు. గుర్రంపై తాను ఒక్క దెబ్బ వేసినట్లుగా నిరూపిస్తే.. బహిరంగంగా తన కాలు నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు. ఉత్తరాఖండ్ సర్కార్ కు వ్యతిరేకంగా తాము ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడికి గుర్రాలపై వచ్చిన పోలీసులు తమ కార్యకర్తలను చితకబాదారని అంటున్నారు. విచక్షణా రహితంగా తమ కార్యకర్తలపై దాడి చేశారని గణేష్ జోషి ఆరోపించారు.