: వృద్ధుడు బాలకృష్ణారావు కిడ్నాప్ కేసులో పోలీస్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్


కోట్ల విలువ చేసే స్థలం కోసం వృద్ధుడు బాలకృష్ణారావును కిడ్నాప్ చేసిన వ్యవహారంలో నిందితులకు సహకారం అందించారనే ఆరోపణలపై నేరెడ్ మెట్ ఇన్ స్పెక్టర్ చంద్రబాబును సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈసీఐఎల్ లోని రూ.30 కోట్ల విలువ చేసే 2,400 గజాల స్థలం కోసం సైనిక్ పురి నివాసి వాసి బొడ్డపాటి బాలకృష్ణారావును ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో ఆయనకు ఉన్న ఈ స్థలంపై రెండు వర్గాలు కన్నేశాయి. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ఒక వర్గానికి చెందిన మాధవ్ తదితరులు ఈ స్థలాన్ని చేజిక్కించుకునే క్రమంలో బాలకృష్ణారావు కిడ్నాప్ కు పథకం పన్నారు. గత నెల 25వ తేదీ తెల్లవారుజామున బాలకృష్ణారావును ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి మాధవ్ కు చెందిన గార్డెన్స్ కు తీసుకెళ్లారు. స్థలం విషయమై బెదిరించి, మర్నాడు వదిలేశారు. కిడ్నాప్ జరిగిన రోజు బాలకృష్ణారావు ఇంటి వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదు తో ఎస్ఓటీ ఇన్ స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి రంగంలోకి దిగారు. ఈ వ్యవహారం మొత్తం నేరేడ్ మెట్ ఇన్ స్పెక్టర్ చంద్రబాబుకు తెలిసే జరిగిందని, నిందితులకు ఆయన సహకరించారని రంగస్వామి దర్యాప్తులో తేలింది. దీంతో చంద్రబాబును సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News