: వరదలపై ఇష్టారీతిన ఫొటోలు పోస్ట్ చేస్తే ఇక జైలే...'యూఏఈ' హెచ్చరిక
కనిపించిన ప్రతీ ఫొటోను సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ లోకి ఎక్కించే తమ దేశ ప్రజలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి తుపాను, వరదల గురించి ప్రతికూల ఫొటోలను ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తే అటువంటి వారిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ ప్రకటించింది. కొంత మంది ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని యూఏఈ అధికారులు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ చట్టం కింద కఠినమైన జైలు శిక్షతోపాటు పది లక్షల దీర్హామ్ ల జరిమానా విధించే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ కథనం పేర్కొంది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలు, వరదలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజాజీవనం స్తంభించిన విషయం తెలిసిందే.