: శీఘ్రంగా శ్రీవారి దర్శనం


తిరుమలలో బుధవారం వేకువజామునకు భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనం భక్తులకు సత్వరమే లభిస్తోంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వీరు దర్శనం పూర్తి చేసుకోవడానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. ఇక తిరుమలపైకి కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం అయిన 50 రూపాయలు, 300 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులు కేవలం గంటలోనే స్వామి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు.

  • Loading...

More Telugu News