: రెండవ అద్భుతాన్ని ఆమోదించి మదర్ థెరీసాకు 'సెయింట్ హుడ్' ప్రకటించిన వాటికన్


భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరీసాకు వాటికన్ సెయింట్ హుడ్ ను ప్రకటించింది. నేడు సమావేశమైన వాటికన్ కమిటీ, ఆమె చూపిన రెండవ అద్భుతాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడంతో పాటు, ఆమె అభిమానులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సెయింట్ హుడ్ గుర్తింపును ప్రకటించింది. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ కాననైజేషన్ (మహిమాన్విత హోదాను ప్రకటిస్తూ తయారుచేసిన ఉత్తర్వుల పత్రం)పై సంతకం చేశారు. కాగా, మరణించిన 18 ఏళ్ల తరువాత మదర్ కు ఈ హోదా లభించింది. సెప్టెంబర్ 4న ఇండియాలో జరిగే కాననైజేషన్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీతో పాటు ఇండియన్ క్యాథలిక్కుల సంఘం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ సైతం హాజరవుతారని అంచనా.

  • Loading...

More Telugu News