: తగ్గిన పుతిన్... సిరియా నుంచి సైన్యం వెనక్కి!
సిరియాలో సైనిక దళాలను మోహరించి, రష్యా చేస్తున్న యుద్ధంపై విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గారు. సిరియా నుంచి సైనిక దళాలను వెనక్కు రావాలని ఆయన ఆదేశించారు. ఐదు నెలల క్రితం సిరియాలో సైనిక దాడులను ప్రారంభించి, సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్-అసద్ కు వెన్నుదన్నుగా నిలిచిన రష్యా వందలాది మంది ఉగ్రవాదుల సహా పౌరుల మరణానికీ కారణమైంది. తన కార్యాలయంలో రక్షణ, విదేశాంగ మంత్రులతో చర్చించిన పుతిన్, దళాలను వెనక్కు మరలాలని ఆదేశించారు. అయితే, పూర్తిగా సైన్యాన్ని ఎంత కాలపరిమితిలోగా తిరిగి వచ్చేయాలన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఇదే విషయాన్ని అసద్ కు ఫోన్ చేసి పుతిన్ స్పష్టం చేశారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు.