: టీ20 వరల్డ్ కప్ షురూ!... తొలి మ్యాచ్ లో టీమిండియాతో కివీస్ ఢీ


ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ నేడు ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో 10 దేశాల క్రికెట్ జట్లు పాలుపంచుకుంటున్నాయి. టైటిల్ కోసం హోరాహోరీగా సాగనున్న ఈ టోర్నీ... నెలకు పైగా క్రికెట్ లవర్స్ ను కనువిందు చేయనుంది. ఈ మెగా టోర్నీలో ప్రారంభ మ్యాచ్... హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా, న్యూజిల్యాండ్ జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా జరగనుంది. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కూడా పటిష్టమైన జట్టుగా ఉన్న ధోనీ సేన, కేవలం బ్యాటింగే ప్రధాన బలంగా బరిలోకి దిగుతున్న కివీస్ తో తలపడనుంది. నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

  • Loading...

More Telugu News