: రైతు ఆత్మ‌హ‌త్య‌పై తమిళనాడు సర్కారుకు హెచ్ఆర్‌సీ నోటీసులు


ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీతో కలసి పోలీసులు వేధింపులకు గురిచేయడంతో అరియళూరు జిల్లాలో ఓ రైతు తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్న కేసులో త‌మిళ‌నాడు స‌ర్కారుకి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్సీ) ఈరోజు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, కొద్దిరోజుల క్రితం తంజావూరు జిల్లాలోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ట్రాక్టర్ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1.3 లక్షల రుణం రైతు చెల్లించకపోవడంతో అతడిని పోలీసులు చితకబాదారు.

  • Loading...

More Telugu News