: న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలి: చంద్రబాబు


న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసుకుని జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేశాడు’ అని జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జడ్జిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీకి తీరని మచ్చ అని, జగన్ కు ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదని అన్నారు. ముప్పై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనను తానెన్నడూ చూడలేదన్నారు. న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రబాబు అన్నారు. సభ్యుల మనోభావాలను కించపరిచిన జగన్ సభకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News