: మాల్యానే వెన‌క్కి ర‌ప్పించ‌లేని వారు దావూద్‌నెలా రప్పిస్తారు?: శివ‌సేన సూటి ప్ర‌శ్న‌


ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్‌ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యా ప‌ట్ల కేంద్రం ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ ఉదాసీన‌తను బీజేపీ మిత్రపక్షం శివ‌సేన మ‌రోసారి విమ‌ర్శించింది. దేశానికి చెందిన బిజినెస్ మ్యాన్‌నే విదేశాల‌నుంచి స్వ‌దేశానికి ర‌ప్పించ‌లేని కేంద్రం ప్ర‌భుత్వం అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్‌నెలా తీసుకొస్తుంద‌ని సూటిగా ప్ర‌శ్నించింది. విజ‌య్‌మాల్యా, ల‌లిత్ మోదీ వంటి వారు దేశం దాటిపోవడానికి అనువుగా ఉన్న ప‌రిస్థితుల ప‌ట్ల శివ‌సేన నేత సంజ‌య్‌రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటువంటి ఉదంతాలు కేవ‌లం మ‌న దేశ వైఫల్యం వ‌ల్లే జ‌రుగుతున్నాయి కానీ మాల్యా లాంటి వారి స‌మ‌ర్థ‌త‌, పాప్యులారిటీతో కాద‌ని అన్నారు. వారిని ప‌ట్టుకోవ‌డానికి భార‌త్‌కి విదేశాల్లోనూ ఏజెన్సీలున్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. క‌నీసం మ‌న‌దేశ పౌరులనే వెన‌క్కి ర‌ప్పించే స్థితిలో లేక‌పోతే, దావూద్ లాంటి బ‌డా డాన్‌ల‌ను భార‌త్‌కు ర‌ప్పిస్తాం అంటూ ప్రగల్భాలు ప‌ల‌క‌డ‌మెందుక‌ని అన్నారు.

  • Loading...

More Telugu News