: నేను తలచుకుంటే సల్మాన్ పెళ్లైపోతుంది: అమీర్‌ఖాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తన క్లోజ్ ఫ్రెండయిన సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన 51వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను తలచుకుంటే సల్మాన్‌ఖాన్ పెళ్లి అయిపోతుందని అన్నాడు. సింగిల్‌గానే ఉండడానికి ఇష్టపడుతోన్న సల్మాన్‌ఖాన్(50)ని ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని ఇప్పటికే చాలాసార్లు అమీర్ సూచించాడు. అయితే, తాజాగా అమీర్‌ఖాన్‌ను "మీ ఫ్రెండ్ సల్మాన్ ని పెళ్లి చేసుకోమని ఎప్పుడైనా కోరారా"..? అని మీడియా అడిగితే.. "నిజంగా నేనింత వరకు సల్మాన్‌తో గట్టిగా ఆ విషయమై చర్చించలేదు. ఒకవేళ నేను ఆ ప్రయత్నాన్ని చేస్తే కనుక అది విజయవంతమై సల్మాన్‌కి పెళ్లి జరిగిపోతుంది" అన్నాడు. అమీర్ కథానాయకుడిగా రూపొందుతున్న 'దంగల్'లో రెజ్లర్ (మల్లయోధుడు)గా కనిపించనున్నాడు. అటువైపు యష్‌రాజ్ రూపొందిస్తోన్న 'సుల్తాన్' సినిమాలోనూ సల్మాన్‌ఖాన్ రెజ్లర్ వేషంలో కనిపించడం విశేషం.