: ఆ దమ్మూ ధైర్యం మీకు లేవా?: చంద్రబాబుకు జగన్ ప్రతిసవాల్
‘మీపై ఉన్న ఆరోపణలపై సీబీఐతో విచారణకు ఒప్పుకునే దమ్మూధైర్యం మీకు ఉన్నాయా? లేవా?’ అంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రతిసవాల్ విసిరారు. ఓఆర్ఆర్ లో ఆరోపణలు వస్తే వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని, అదే మాదిరి.. సీబీఐ విచారణ వేసుకునే దమ్ము చంద్రబాబుకు లేదని జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసెంబ్లీని పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రకటించారు.