: వైఎస్సార్సీపీ దివాళాకోరు పార్టీ, దోపిడీ పార్టీ: చంద్రబాబు
వైఎస్సార్సీపీ దివాళాకోరు పార్టీ, దోపిడీ పార్టీ అంటూ ప్రతిపక్ష నేత జగన్, ఆ పార్టీ సభ్యులపై సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలను నిరూపించాలి లేదా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో స్పీకర్ చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. సోలార్ ఎనర్జీలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన జగన్, ముందు అది నిరూపించాలన్నారు. రూ.7,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆధారాలు చూపాలని, వారి వద్ద లేని పక్షంలో ఎక్కడి నుంచైనా సరే తీసుకు వచ్చి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. రౌడీయిజం చేయాలని చూస్తే కోరలు తీస్తానంటూ చంద్రబాబు మండిపడ్డారు.