: వీడిన బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ!


బెర్ముడా ట్రయాంగిల్... బ్రిటన్ ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకూ విస్తరించిన ప్రదేశం. ఈ ప్రాంతంలోకి వెళ్లిన ఎన్నో నౌకలు అదృశ్యమై పోయాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలూ మాయమయ్యాయి. ఈ ప్రాంతం నుంచి పేలుళ్లు వినిపించడం సర్వ సాధారణం. అసలిక్కడ ఏముంది? పెద్ద పెద్ద నౌకలు మాయం కావడానికి కారణాలు ఏంటన్నది ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి సస్పెన్స్ గా మిగిలిన ప్రశ్న కాగా, దీనికి సమాధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంగా కిలోమీటరు వెడల్పు, దాదాపు 150 అడుగుల లోతైన క్రేటర్స్ (అగ్ని బిలాలు) ఎన్నో ఉన్నాయని గుర్తించారు. వీటి అడుగు భాగం నుంచి పెద్దఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం కారణంగా భారీ పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించారు. ఒకసారి మిథేన్ మండిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు ఒక్కసారిగా బిలాల్లోకి దుముకుతుండటంతో, ఉపరితలంపై నీటి గుంతలు ఏర్పడి భారీ నౌకలు మునిగిపోతున్నాయని అంచనా వేస్తున్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విమానాలు కూలిపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చని, తమ శోధనతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ దాదాపు వీడినట్టేనని, మరిన్ని సాక్ష్యాల కోసం ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News