: పాక్ కెప్టెన్ అఫ్రిదికు లీగల్ నోటీసులు


పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకు లాహోర్ కు చెందిన ఒక న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. అందుకు కారణం... అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలే. టీ20 వరల్డ్ కప్ నిమిత్తం భారత్ కు వచ్చిన అఫ్రిదీ నిన్న విలేకరులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ లో కన్నా భారత్ లోనే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అఫ్రిదీకి సదరు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అఫ్రిదీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పాక్ కు క్షమాపణలు చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News