: 22 ఏళ్ల వయసులోనే పోలీసులను కొట్టిన చరిత్ర జగన్ ది!... బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు


ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యేకించి అధికార టీడీపీ ఎమ్మెల్యేలు... విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఆది నుంచి నేర చరిత్రేనని ఆయన ఆరోపించారు. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసిన జగన్... అక్కడి పోలీసులపై చేయి చేసుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా ఆయన ప్రదర్శించారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News