: దర్శకుడు సుశాంత్ రెడ్డిపై పోలీసు కేసు!
'సూపర్ స్టార్ కిడ్నాప్' సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డిపై పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ హోటల్ లో జరిగిన పార్టీకి సుశాంత్ తో పాటు ఈవెంట్ మేనేజర్ రవి వెళ్లారు. అంతకుముందే వీరిద్దరి మధ్యా కొన్ని గొడవలు ఉన్నాయి. వాటిపై వాదోపవాదాలు జరుగగా, గొడవ పెరిగి పెద్దదై, ఇద్దరూ తన్నుకున్నారు. ఆపై రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, హీరో మహేష్ బాబును కిడ్నాప్ చేసేందుకు కొందరు పన్నిన పన్నాగాలు ప్రధానాంశంగా గత సంవత్సరం సుశాంత్ 'సూపర్ స్టార్ కిడ్నాప్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆపై డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లతో కలసి పోలీసులకు పట్టుబడ్డాడు కూడా.