: అవిశ్వాసంపై 7 గంటల చర్చ!... తక్షణమే నిర్వహించాలని బీఏసీ నిర్ణయం
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై విపక్ష వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజే చర్చ జరపాలని సభావ్యవహారాల కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చ జరపాలని కూడా బీఏసీ తీర్మానించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వెల్లడించారు. నిర్మాణాత్మక చర్చకు విపక్షం సిద్ధం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బీఏసీ నిర్ణయం నేపథ్యంలో మరికాసేపట్లోనే సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలు కానుంది.