: విషం తాగి మరణించిన పాప్యులర్ తమిళ టీవీ స్టార్ ప్రశాంత్
తమిళ టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి ప్రశాంత్ తన నివాసంలో విషం తాగి మరణించాడు. మద్యంలో విషం కలుపుకుని ప్రశాంత్ తాగాడని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఒంటరితనాన్ని భరించలేక ఈ పని చేసుండవచ్చని పోలీసులు వ్యాఖ్యానించారు. ప్రశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్ పాక్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్, మూడు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ప్రశాంత్ తో ఉండటం లేదని తెలుస్తోంది. తమిళంలో అనమలై, సెల్వి, అరసి తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో పాటు నీరం, తేగిడి, వడాకర్రీ తదితర సినిమాల్లోనూ ప్రశాంత్ నటించాడు.