: మాల్యా చివరిసారిగా కనిపించింది అక్కడే!
ఇండియాలో పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉండి, బ్యాంకులకు రుణాలను ఎగవేశాడన్న ఆరోపణల నేపథ్యంలో దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా చివరిసారిగా ఎక్కడ కనిపించాడో తెలుసా? రాజ్యసభలో! మార్చి 2న మాల్యా లండన్ కు వెళ్లాడని సీబీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుకు ఒక రోజు ముందు అంటే, 1వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాల్యా రాజ్యసభకు హాజరయ్యారు. ఈ మేరకు అటెన్డెన్స్ లో ఆయన పేరు నమోదైంది. రెండోసారి రాజ్యసభ ఎంపీగా ఎంపికైన ఆయన, మొత్తం 424 రోజులు సభ జరుగగా, 121 రోజులు హాజరయ్యారని రాజ్యసభ అటెన్డెన్స్ గణాంకాలు చూపుతున్నాయి. 2002 నుంచి 2008 వరకూ, ఆపై 2010, జూలై 1 నుంచి ఆయన రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఈ సంవత్సరం జూన్ 30తో ముగియనుంది.