: బెంగాల్ లో దీదీకి ఎదురు గాలి!... తృణమూల్ ను ఓడించాలని మావోల ప్రచారం


పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ కాలం పాటు సాగిన కమ్యూనిస్టుల పాలనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చరమ గీతం పాడారు. పాతికేళ్లకు పైగా సాగిన కమ్యూనిస్టుల పాలనను గడచిన ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇంటికి సాగనంపారు. ఇది జరిగి అప్పుడే ఐదేళ్లు పూర్తవుతోంది. మళ్లీ ఆ రాష్ట్రంలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గడచిన ఎన్నికల మాదిరే ఈ దఫా కూడా దీదీదే విజయమంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే దీదీ సర్కారుకు నిషేధిత మావోయిస్టులు షాకిచ్చారు. రానున్న ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలని మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేస్తోందట. దీనిపై విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న మమతా బెనర్జీ... మావోల వ్యూహానికి విరుగుడు ప్రణాళిక రచించే పనిలో పడ్డారట.

  • Loading...

More Telugu News