: దాడులు చేసే దేశంతో ఆటలేంటి?... అడ్డుకుని తీరతామన్న ఉద్ధవ్ థాకరే
మరో ఐదు రోజుల్లో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ ని అడ్డుకుంటామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ధాకరే తెలిపారు. "ఓ చేత బాంబులు, మరో చేత్తో క్రికెట్ ఆడలేము. ఇండియాపై దాడులు చేయిస్తున్న దేశంతో ఆటలేంటన్నదే మా ప్రశ్న. క్రీడలకు మేం వ్యతిరేకం కాదు. కబడ్డీ మ్యాచ్ లు ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఇదే సమయంలో చొరబాట్లకు, ఉగ్రదాడులకు సహకరిస్తారు" అని థాకరే విమర్శలు గుప్పించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ నెల 19న జరగాల్సిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కోల్ కతాకు మారిన సంగతి తెలిసిందే.