: దోషి మరణిస్తే వారసులే బాధ్యులు... బాంబే హైకోర్టు కీలక తీర్పు


చెక్ బౌన్సు కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పిచ్చింది. జరిమానా కట్టాల్సిన వ్యక్తి, దాన్ని చెల్లించకుండానే మరణిస్తే, ఆ బాధ్యత వారసులదేనని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని దోషి ఆస్తుల నుంచి వసూలు చేయాలని హైకోర్టు జడ్జి శాలినీ ఫన్సల్కర్ తెలిపారు. తన భర్తకు చట్టబద్ధమైన వారసురాలిని అయినంత మాత్రాన ఆయన చెల్లించాల్సిన జరిమానాను తానెలా కడతానని షహీం అనే మహిళ హైకోర్టును ఆశ్రయించగా, విచారించిన కోర్టు ఈ తీర్పిచ్చింది. అంతకుముందు షహీం భర్త సైఫుద్దీన్ కు ట్రయల్ కోర్టు రూ. 25 వేల జరిమానా విధించగా, దాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేసి విచారణ దశలోనే అతను మరణించాడు. ఆపై అతని భార్య నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని బాధితులు కోర్టు కెక్కారు.

  • Loading...

More Telugu News