: మధుప్రియ భర్త అనుకుని వేరే వ్యక్తిని చితకబాదారు!


గాయని మధుప్రియ-శ్రీకాంత్ దంపతుల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భావించి వేరే వ్యక్తిని చితకబాదిన సంఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు.. మందులు కొనేందుకని మెడికల్ షాపునకు వెళ్లిన మహ్మద్ నయూమ్(24) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు చితకబాదారు. దీంతో నయూమ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఉప్పల్ లోని మాట్రిక్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి పాల్పడింది మధుప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడని, వారితో పాటు మరో 14 మంది వ్యక్తులు కూడా ఉన్నారని బాధితుడు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు మధుప్రియ తల్లిదండ్రులు, సోదరుడు మరో 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News