: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తాం: సీఎం కేసీఆర్
రాబోయే మూడేళ్లలో తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో ఆయన ఈరోజు ప్రసంగించారు. తమిళనాడు తరహాలో వైద్య సేవలందిస్తామని అన్నారు. 2016-17 ఆర్థిక బడ్జెట్ లో వైద్య శాఖకు గణనీయంగా కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, బీడీ కార్మికులకు జీవన భృతి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.