: ఇరాక్ లో ఐఎస్ దారుణం.. రసాయన దాడిలో చిన్నారి మృతి
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మళ్లీ రెచ్చిపోయింది. ఇరాక్ లోని కిర్ కుక్ టాజా పట్టణంలో రసాయన దాడికి పాల్పడింది. ఈ దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, వందలాది మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ వారి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం 8 మంది క్షతగాత్రులను ఇరాక్ రాజధాని బాగ్దాద్ కి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి జర్మన్, అమెరికన్ ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. రసాయన పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తోంది.